STORYMIRROR

Baswaraj Mangali

Classics Others

4.5  

Baswaraj Mangali

Classics Others

నమో విష్ణువే! నమో జిష్ణువే!

నమో విష్ణువే! నమో జిష్ణువే!

1 min
344







           🙏   ఓం నమో నారాయణాయ 🙏


||పరమానందమగు నీ దివ్య మంగళ మనోహరరూపదర్శనం

ఆత్మనందమగు  నీ పంచాక్షరి   నామ జపోచ్చరణం||

||అరుణ పారాణికెంత మోక్షమో గదా! హరి

చరణ పద్మాల పై అలారారుతుండగ.||

||పద్మావతి సమేతుడై కొలువుదీరగనే

అనంతుడి ముదము పై అలుమకోదా

ఆనందాల హేళ, కోలాటాల మేళ.||

||జాజీ, సంపంగి, మల్లె, తామరులు తపించె నేమో!

వక్షస్థలం పై నిక్షిప్తమై విరజిల్లాలని

జాపియించెను జలదులు తపియించెను వనములు

కనులరా కాంచి తనువు చాలించాలని||

||శ్రీహరి నామము ప్రజ్వలిల్లగనే

హరించే ఆత్మలు, తరియించే జన్మలు||

||కౌస్తుభమునకు మెరుపు సన్నగిల్లెను

పద్మనాభుని ముఖారవిందం ఎదుటనే||

||ప

ిలుపులు వైకుంఠపు తలుపులు తాకగనే

ఇడుపుల ముడుపుల విప్పెదవట! వేంకట హరి!||

||సాంబ్రాణుల దూపం దుముకుచుండగనే

అగరు బత్తుల పొగలు పొంగుచున్నాయి

వే వేల దండాలు వెంకట గిరీశ! వైకుంఠ వాస!||

||కుమూదినుల పై కురుపించెదవట కౌముదిని

ముదమున వెదజల్లెదవట ఆనంద సౌదామినిని||

||తీరని ఋణములు తీర్చేదవట

మారని మనుగడ మార్చేదవట||

||మేఘ మాలికయో హంస తూలికయో

రాగ గుళికయో నీ సన్నిధి స్వామీ||

||అర్దరహిత జీవితుల నుదుటన

పరమార్థభరితమగు పసిడి పూతను పూసేవు

లీలావినోది! కరుణాబ్ది! పుండరీకాక్ష!చారుకేశ!||

||జలజలమని జరులు జారెను

విలవిలమని విరులు విరిసేను నీకై! స్వామీ

నిలకడ లేని మదికి నీడయ్యి నిలిచావు

నిలబడ లేని కాళ్ళని నీ దారిలోకి మాలిచావు.||


||ఆనందా, గోవిందా!ఆదిత్యా! అచ్యుతా

పండిత పామరా మునిజన వంధిత !...

మము బ్రోవగ రా దొర.మనోహర ముకుందా...||

||ఓం నమో విష్ణువే! జిష్ణువే ||

||ఓం నమో కృష్ణవే! తృష్ణవే ||



Rate this content
Log in

Similar telugu poem from Classics