అన్వేషీ
అన్వేషీ
"కళాప్రపూర్ణుడు "... దాశరధి కృష్ణమాచార్యులవారి "ఆ చల్లని సముద్ర గర్భం " కావ్యం నన్ను ఎంతగానో
ఆకట్టుకుంది. ఆ కావ్య ప్రేరణ తో రాసాను...
ఆయన రచన శైలి లోనే నేను రాసాను.... తప్పులుంటే క్షమించగలరు..... 🙏..........
ఉష కోసం వేచిన ఆశకు
నిశిలో వెతుకుట దీనికో?
ఒక రవికిరణం క్రాంతి
తొలగునా మానవ బ్రాంతి?
ఓ మనిషీ.......నిత్యఅన్వేషీ ....
సత్యసంఘర్షి.
కలల్లన్నవే కనని కనులకు
సాకరమావునా బంగారు భవిత?
సహకారమే లేని ఈ సమాజానికి
సిగ్గు పడదా మన జాతి చరిత?
ఓమనిషీ.......నిత్యఅన్వేషీ ......
సత్యసంఘర్షి.
బద్ధకస్తమైన భారతావని ని
మేల్కొలిపే చైతన్యం ఎప్పుడో?
అస్తవ్యస్తమైన పరిపాలనకు
సుస్థిరమైన రాజ్యాంగం ఎక్కడో?
ఓమనిషీ.......నిత్యఅన్వేషీ ......
సత్యసంఘర్షి.
వినపడని ఆకలి కేకల కోసం
ఉంటుందా ఓ దేశం?
కనపడని ఎందుమావి కోసం
ఎంతదూరమో ఈ ప్రయాణం?
ఓమనిషీ.......నిత్యఅన్వేషీ ......
సత్యసంఘర్షి.
చిక్కుబడిన ప్రశ్నలకు
అంతుచిక్కని జవాబులెన్నో?
తడారిన కన్నులు రాల్చిన బాష్పాలెన్నో?
ఓమనిషీ.......నిత్యఅన్వేషీ .....
సత్యసంఘర్షి.
