జ్వలిస్తూ ఆరిపోతున్నా...
జ్వలిస్తూ ఆరిపోతున్నా...


పురిటి బాధ నోర్చే ఆడ జన్మై ఉన్నా
భయంగా ఉంది
మరో ఆడపిల్లని కడుపున మోయాలంటే
ఓ దేవా చెప్పవయ్యా
ఎం రాశావో మా విధి రాతలో
మా నుదుటిపై….
ముల్లతో నింపుకున్న మనసుతోనా
నరకంతో నీండిపోయిన ప్రాపంచాన్నా
కలుపు మొక్కలనీ మోస్తున్న ఈ పుణ్య భూమినా
ఏ రోజున మారని ఈలోకాన్నా
విష వలయాలా మధ్యలో శపించే కలలనా….
కానీ భరించే విధంగా లేదు నిజం...
పూచే పువ్వులా నవ్వే నేను
సాయమడిగే భాష లేక
కంటి జడితో నిలిచానీలా
గంతలున్నన్యాయం ముందు…
కమ్ముకున్న అధికారపు చీకట్లలో
కరుణలేని చితీపై
నిప్పురవ్వల్లా జ్వలిస్తూ ఆరిపోతున్నా...
జరిగిన ఘోరాన్ని మార్చలేం.. వర్ణానాతమైనా నీ బాదని చూసిన మనసు భారమైంది..
Women's Diary...