తెలాయదుగా
తెలాయదుగా
నన్ను చూసి ఎందుకలా నవ్వుతావొ తెలియదుగా..!
అనురాగపు పూవులేల రువ్వుతావొ తెలియదుగా..!
మరపురాని జ్ఞాపకాల తోటలోని చిత్తరువా..!
ఆత్మీయత మధువులేల పంచుతావొ తెలియదుగా..!
జన్మ విలువ తెలిపేందుకు సహకరించు మందారమ..!
శ్వాస మాటు దారమేల నిలుపుతావొ తెలియదుగా..!
ప్రేమ కన్న పరిమళించు సుమమేదీ లేదు కదా..!
సహజీవన సూత్రమెలా నేర్పుతావొ తెలియదుగా..!
కాలాలకు అతీతమౌ ఓ మైత్రీ మేఘమాల..!
అక్షరాల చిత్రమెలా..అల్లుతావొ తెలియదుగా..
