నా మనసే
నా మనసే
నా మనసే ప్రేమలేఖ..చేయాలని చూస్తున్నా..!
గుండెచాటు మాటలన్ని..దాచాలని చూస్తున్నా..!
ఈగదిలో ఒంటరిగా..నీ వెచ్చని తలపులలో..
మంచుపూల మేఘంలా..కరగాలని చూస్తున్నా..!
మదిలోయల కదలాడే..భావాలకు రూపమేదొ..
నీ కన్నుల లోగిలిలో..ఒంపాలని చూస్తున్నా..!
పెదవివిప్పి చెప్పలేని..మాటలెంత వేదించునొ..
మరి కదలని రెప్పలింట..ఇగరాలని చూస్తున్నా..!
పెనవేసుకు పోవాలను..ఆరాటం సాక్షియయ్యె..
అనురాగపు మాధురిగా..మిగలాలని చూస్తున్నా..!
అమృతమేదొ స్వర్గమేదొ..పనేముంది వెతికేయగ..
నీచూపుల వెన్నెలింత..గ్రోలాలని చూస్తున్నా..!

