సౌఖ్యమోయి
సౌఖ్యమోయి
అరవిరిసిన గులాబిలా..నవ్వుంటే సౌఖ్యమోయి..!
ఒక ఖాళీ కప్పులాగ..మనసుంటే సౌఖ్యమోయి..!
బాధలన్ని బంధాలకె..తెంచుకునే పనేంలేదు..
ఒకసాక్షిగ నిలువగల్గు..చూపుంటే సౌఖ్యమోయి..!
ప్రేమించా ననేమాట..పెదవివెనుక ఆపిచూడు..
ఆవేశం పొంగకుండ..తలపుంటే సౌఖ్యమోయి..!
ప్రేయసితో కబురులాడ..ముచ్చటైన తుఫానులే..
గగనమంత ఆనందం..తోడుంటే సౌఖ్యమోయి..!
ఎవరినుండి ఎవ్వరేమి..నేర్చుకొందురో ఏమో..
నేర్చుకునే ఉల్లాసపు..చురుకుంటే సౌఖ్యమోయి..!
అశ్రువుతో ప్రేమలోన..పడిపోయే విద్యలేదు..
తడిగుండెగ మిగిలిపోవు..ఒడుపుంటే సౌఖ్యమోయి..!
మాటలన్ని మౌనముగా..రాలుపూలె ఓ మాధవ..
నను నీలో చూసుకునే..పట్టుంటే సౌఖ్యమోయి..!

