Women's Diary

Comedy Drama Romance

4  

Women's Diary

Comedy Drama Romance

నువ్వేనా..నా నువ్వేనా.. 5

నువ్వేనా..నా నువ్వేనా.. 5

6 mins
321



హాయ్ గైస్... నేను మ్యాగీ మీ గ్రూప్ ఐ మీన్ మీ క్లాస్మేట్ నీ, మార్నింగ్ అందరు అలా బయటకి వచ్చేశారు అప్పుడే అర్ధమైంది మీరంతా ఒకే బాచ్ అని, నన్ను మీ బాచ్ తో చేర్చుకుంటారా నాకు ఇక్కడ అంతా కొత్తగా ఉంది పైగా రీసెంట్ గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము మై డాడ్ ఆర్మీలో వర్క్ చేస్తారు ఈమధ్య రిటైర్ అయ్యారు.. సారీ నేను ఎక్కువ చెప్పానా..


హమ్మయ్య ఆపావా ఎదుటి వారికీ అవకాశం ఇవ్వకుండా మాట్లాడి ఫైగా సారి చెప్తావా..


నాని నువ్వు ఆపు అంటు శైలు మ్యాగీకి అందరిని పరిచయం చేస్తుంది...


*****


మొదటి రోజు ఎలా ఉందే కాలేజీ అని తనని ఆపిన శారదా దేవిని తప్పుకుని.. బానే ఉందిలే అంటు తన గదిలొకి వెళ్తున్న రేణు తల మీద ఒకటి వేసి వేడేడి రాలేదా అంటుంది..


తల రుద్దుకుంటు ఒసై ముసలి నీ మనవడు ఊరంతా బలాదూర్ గా తిరిగి అప్పుడు వస్తాడులే అంటుంది రేణు...


ఇంకోసారి మా అమ్మనీ ముసలి అన్నవంటే ఊరుకునేది లేదు కోపంగా చూస్తున్న సీత నీ చూస్తూ...


అమ్మ... సీతమ్మ... ఏ.. మని పిలవాలి మీ అమ్మనీ స్వీట్ సిక్స్ టీన్ అనా లేకపోతే మదర్ ఆఫ్ ఎర్త్ అనా..


ఎం అంటున్నవె నిన్ను.. అంటు రేణు తల మీద ఒక్కటి వేస్తోంది సీత..

మామయ్య ఎక్కడున్నావు ఈ తల్లి కూతుర్లు నన్ను కొడుతున్నారు అని తల రుద్దుకుంటూ డ్రామా మొదలు పెడుతుంది రేణు..

నోరు ముయి లేకపోతె అని దగ్గరికి వస్తున్నా సీత నీ చూసి నవ్వుతు మం తల్లి మీ అమ్మనీ నేనేం అనలేదు ఆ సీతా దేవీకీ అమ్మ అని చేప్పాను అంటు గదివైపు వెళ్తుంది రేణు...


ఉరుకోవే సీతా అది నన్ను అలా పిలిస్తేనే నాకు బాగుంటుంది..

సరే అమ్మ అలానే పిలిపించుకో నేను వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్దుతా సీత వెల్లిపోతుందీ...


అందరు కలసి డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు...


డిన్నర్ అయిపోయాక మామయ్య నాకు డబ్బులు కావాలి అమాయకంగా అడుగుతుంది రేణు..


ఎందుకే పాకెట్ మని ఇచ్చానుగా అంటాడు రఘు..

డాడ్ నాకు ఎక్కువ కాదులే చిల్లర కావాలి అని విజయ్ వైపు చూసి నవ్వుతుంది..

చిల్లర ఎందుకు అని మళ్ళీ రఘు అడుగుతాడు..


పోనిలే రఘు చిల్లరేయే కదా అంటు ఫైవ్ హండ్రేడ్స్ ఇవ్వబోతుంటే భూపతి, ఇవి కావు మమయ్య కాయిన్స్ కావాలి..

సరే తీసుకో భూపతి కాయిన్స్ ఇస్తాడు...


చాలా నా దగ్గరివి కుడా కావాలా రఘు నవ్వుతూ... చాలు డాడ్ రేపు తీసుకుంటాలే..


ఎందుకు హాని బంగారం లాలనగా అడిగాడు భూపతి..


భూపతి మెడ చుట్టూ చేతులు వేసి ఎం లేదు మామయ్యా కొత్త కాలేజీలో దరువేసుకునే ముష్టివాడు ఉన్నాడు వాడికి ఇద్దామని చెప్తూ.. విజయ్ విన్నాడో లేదో అని చుట్టు చూస్తుంది...


అప్పటికే కళ్ళెర్ర చేసి తనవైపే వస్తున్నాడు విజయ్..


అమ్మొ అంటు భూపతి వెనుక దాకుంటుంది...


నన్నే ముష్టివాడు అంటావా నీకెంత ధైర్యం డాడ్ నువ్వు అడ్డులే ఈ రోజు అయిపొయింది నా చేతిలో...


భూపతి వెనుక నుండి బయటకి వచ్చి నడుముమీద చెయి పెట్టి నిలబడి వేలు చూపిస్తూ నేనేమైన నీపేరు అన్నానా విజయ్ దరువేసుకునే ముష్టివాడు అని... అంటే నువ్వే ఒప్పుకున్నావా అంటు ఐబ్రో ని పైకి అని చూస్తుంది రేణు...

 

 నేను అన్నవి నాకే చెప్తావా నిన్ను అంటు పళ్ళు నురుతున్నాడు విజయ్..


 బాగా కాలిందా వెళ్ళి ఐస్ వాటర్ తాగు అని తన గది వైపు పరుగులు పెడుతుంది..



******************************



హాయ్ హిమ ఈ రోజు నేనే ఫస్ట్.. అంత లేదు రేణు టైం చూడు నువ్వు ఈ రోజు లేట్ గానే వచ్చావు  పద క్లాసుకి నిన్న కూడా ఎం వినలేదు...

బుంగమూతి పెట్టి హిమ వెనుకే వెళ్తుంది రేణు..

క్లాస్ అయిపోవడంతో హమ్మయ్య నిన్న సరిగ్గ క్లాసులు జరగ లేదు అంటా ఇక కొపం తగ్గిందా..

రేణు మాటలకి హిమ నవ్వుతు క్లాస్ నుండి బయటకి వస్తుంది..


అబ్బా.. ఈ బ్యాగ్ బరువుగా ఉందే అనవసరంగా అంత చేంజ్ తిసుకున్న అంటు బయటకి తిస్తుంది రేణు..


ఏంటీ ఇప్పుడు ఇవి ఇస్తావా క్యాంటీన్లో లెక్క పెట్టేసరికి ఈవెనింగ్ అవుతుంది..


శైలు కంగారుపడకు ఇవి ఎందుకు తెచ్చిందో చెప్తుంది రేణు..


రేణు మరీ ఇలానా టీజ్ చేసేదీ బామ్మ ఎమో మీరు పెళ్ళి చేసుకుంటే చుడాలి అని అంటుంది మీరేమో మరీ ఎక్కువ చేస్తున్నారు...


 ఆ ముసల్దానికి చాలా కోరికలు ఉన్నాయే అవి తీరవని తెలియదు పాపం నువ్వు మళ్ళి తనకి సపోర్ట్ అని తనకి కావాల్సిన ఐస్ క్రీం ఆదర చేస్తుంది రేణు..


ఎందుకే అలా అని అందరిని బాధ పెడతావా కొంచం సీరియస్ గా అన్నది హిమ..


ఛీ.. ఛీ.. అసలు ఆ టాపిక్ ఎత్తద్దు నాకు చిరాగ్గా ఉంది ఆ వెధవతో పెళ్ళా దాని కన్నా అంటున్న రేణు మాటలకి అడ్డు పడుతూ సరే ఆపు అందరు మన వైపు వస్తున్నారు అంటుంది హిమ..

హిమ కొపం చూసి మూతి ముడుచుకుంది రేణు కాని ఐస్ క్రీం మాత్రం లాగించేస్తుంది..


ఏంటి క్లాసు లేకపోయినా వెళ్ళ లేదు ఇక్కడే ఉన్నారు అని రేణు ఎదురుగా ఉన్న చైర్ లో సెటిల్ అయింది మ్యాగీ..


ఏం లేదు మ్యాగీ రేణుకి ఐస్ క్రీమ్ తినిపిద్దామని రేణు వైపూ చూస్తుంది హిమ నాకేమీ వద్దు అంటునే హిమ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకుని మొత్తం తినేస్తుంది రేణు..


నాకు కొంచం వర్క్ ఉంది యూ గైస్ క్యారుయాన్ అని వెళ్తున్న శైలు వెనుకే వెళ్తూ తన పక్కగా నడుస్తూ మీరంతా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఆ అని అడుగుతుంది మ్యాగీ..


అవును మ్యాగీ అంటా స్కూల్ నుండి కలిసి ఉన్నాం..


వావ్.. శైలు కానీ అందరు హిమ కి ఎందుకు రెక్క్ష్పెట్ ఇస్తారు ఎక్కువగా రేణు, విజయ్ ఇస్తారు..


ఎందుకంటే హిమ మా కన్నా వన్ ఇయర్ సీనియర్.. హిమ మామ్ షడన్ గా చనిపోయారు అప్పుడు తనకి వన్ ఇయర్ వెస్ట్ అయింది, మేము తనతో కలిసిపోయాము, రేణుకి విజయ్ కి తను రిలేటివ్ అందుకే తను వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటుంది, సరే నాకు లేట్ అవుతుంది బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది శైలు..


మ్యగీ కూడా ఎదో ఆలోచిస్తూ వెళుతుంది..


బావా అని మాటలు సాగదిస్తూ.. విజయ్ వెంటనే బయల్దేరు నీ ఫ్యాన్స్ ఇటు వస్తున్నారు అని నాని అనేలోపే.. విజయ్ నీ చుట్టేస్తారు నలుగురు అమ్మాయిలు ఏం చేయలేక వాళ్ళతో బయటకి వెళ్తాడు విజయ్..

 వాడికేమో అంతా ఫాలోయింగ్ వరుణ్ కెమో హిమ నాకే అసలు ఎవరు పడరు అని ముఖం వేలాడదిస్తాడు నాని..


 ఒరేయ్ నాని పడతాయి అని చిరు కోపంగా అంటుంది హిమ..


రేయ్ నాని బాధపడకురా అంటు భుజం మీద చెయి వేసి నడుస్తూ అలా అమ్మయిలు వెంటపడాలి అంటే నువ్వేమీ వాడిలాగా ఐఓఐ (ioi) కాదుగా అంటు వెళ్తున్న విజయ్ నీ చూస్తుంది రేణు..


రేణు వాడిని ఎప్పుడు ఐఓఐ (ioi) అంటావే దాని మీనింగ్ ఏంటి..?తన సందేహాన్ని బయట పెట్టాడు నాని..


అది వాడినే అడుగురా అని నాని భుజం తట్టి వెళ్ళిపోతుంది రేణు.. 


రేణు వెళ్తున్న వైపు చుస్తూ నిలబడుతుంది హిమ..


ఏంటి హిమ అలా ఉన్నావు ఎం ఆలోచిస్తున్నావు..

వరుణ్ మాటకి తన ఆలోచన నుండి బయటకి వస్తుంది...


ఏం లేదు వీళ్ళ గొడవలకి బామ్మా చాలా భాదపడుతుంది వరుణ్..


హిమ వాళ్ళకి ఇష్టం లేకపోతే బలవంతం చేయకూడదు నేను వాడి దగ్గర ఈ టాపిక్ తెస్తే ఏమ్మన్నడో చెప్పనా...

వద్దులే వరుణ్ నేను ఉహించగలను పద వెళ్దాం..


ఎక్కడికి నువ్వు ఇలా దిగులుగా ఉంటే నేను చూడలేను ప్లీజ్ కొంచం నవ్వు అంటు ముందుకు వస్తా\డు వరుణ్..


ఏంటి దగ్గరికి వస్తున్నావు వరుణ్ భుజం మీద గట్టిగా గిల్లుతుంది హిమ..

హిమ నీకు రేణు పట్టిందా ఏంటి.... పైగా నాకు నెప్పిగా ఉంటే నవ్వుతావా అంటు ఇంకో అడుగు ముందుకి వేస్తాడు వరుణ్..

హిమ కంగారుగా చూస్తూ హాయ్ డాడ్ అనగానే

మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తాడు వరుణ్..

వెంటనే అక్కడి నుండి పరుగున వెళ్ళిపోతుంది హిమ..


ఇంటికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు... ఏంటా పరుగు.. అని కోపంగా అడుగుతున్న అతన్ని చూసి..

అక్కడే ఆగి అది.. అ..దీ.. డాడ్... అంటు కంగారు పడుతుంది హిమ..





ఇంకా ఉంది...


Women's Diary..


 







రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్