STORYMIRROR

Dinakar Reddy

Comedy Romance

4  

Dinakar Reddy

Comedy Romance

మొహమాటం

మొహమాటం

1 min
338

నీ కళ్ళు నా పెదాల్ని తడుముతుంటే

నీ మునివేళ్ళు నా నడుమును పట్టుకుంటే


నీ జుత్తులోకి నా వేళ్ళు వెడుతుంటే

నీ తెల్ల వెంట్రుకలు లెక్క పెడుతుంటే


నా యదపైన నీ శ్వాస తగులుతుంటే

నీ నాలుక సున్నాలు చుడుతుంటే


నీ నా తనువల మధ్య గాలి బంధిస్తే

నీ చెమట వాసన సుగంధంలా నే ఆఘ్రాణిస్తే


నీ బ్రహ్మచర్యానికి వీడ్కోలు ఇస్తుంటే

నన్ను నువ్వు వశపరచుకుంటుంటే


ప్రకృతీ పురుషుల సంగమంలా

నీ నా ఆత్మలు ఒకటిగా

సురత క్రీడలాడి అలసి 

ఆపైన నే నీ విశాలమైన ఛాతీ పైన నిదురిస్తే


తెల్లవారి వెలుగులో

నా కుంకుమ రేఖలు అంటిన

నీ ఛాతీని చూసి

నాకేదో మొహమాటం


అని అతని తలపులలో

ఆమె వ్రాసెనొక శృంగార కావ్యం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Comedy