దువ్వెన
దువ్వెన


ఏమని చెప్పగలము
ఎంతని పొగడగలము
నీకోసము ఎంత చెప్పిన
అతిశయోక్తియే కాదు..
అనుభవాలు దొంతరలు
దొంతరలుగా పేరుకుపోయాయి
పాలలో వెన్నలా
నువ్వు ప్రక్కనుంటె సమాజమే నావైపే తిరుగుతున్నట్టుంది..
నా తలకాయని ఎవడి బాబు గారి సొమ్ము అనుకునో
పొలమును దున్ని నట్టు దున్ని
కల్తీ లేని వంశవృక్ష విత్తనాలుని నాటి...
నేను రాసిన తైలముతో కిట్టీ పార్టీలు జరుపుకుని..
నా నెత్తిపై నృత్యాలు..
టిక్ టాక్ లు చేసి..
నా వేళ్ళతోనే
నా బుర్రపై ఫిడేలు వాయించేటట్టు చేస్తున్న
ఆ పేను సామ్రాజ్యముని కూకటి వ్రేళ్ళతో వేరి పారాయడానికి నువ్వు చేసిన సాయం మరువగలనా...
నా నెత్తి మీద నుండి నీ సహకారముతో రాలిన పేను పై ఆన..
ఓ దువ్వెన...నేనే ముఖ్యమంత్రినైతే,.
సృష్టిలో మీ జాతులన్నింటికి జాతర పెట్టి..
ఆ రోజు ప్రభుత్వ సంస్థలన్నిటికి శెలవు ప్రకటిస్తా...
ముఖ్యంగా మా ఆడవాళ్ళకు...
మా నెత్తులపై పుంజుడు వెంట్రుకులున్నా ...నిను వదలము..
మాలో ఒకరివి నీవు..
మొబైల్ లేని రోజంటూ ఒకటి ఊహించకల్గుతామేమో గాని..
నువ్వు లేని మా శిరోజాలను కలలో కూడ ఊహించలేము..
నీది మాది ఈనాడు ఏర్పడే బంధము కాదు...
తరతరాలుగా మా మానవ జాతి అందాలను తీర్చిదిద్దే
నీకు ఏమిచ్చి తీర్చుకోగలము ఋణం..
వారము రోజులకొకసారి నీకు సర్ఫ్ తో అభిషేకము చేయడం తప్పా...