కలం
కలం


అభివృధ్ధి పథము లో
తన ఆకారాలు మార్చుకున్నా
వ్యక్త పరిచే అభిప్రాయాలను
మాత్రము గమ్యాలను చేర్చే
దివ్యమైన ..తేజో వంతమైన
వాహనం కలము..
మనసులో జనించే
ప్రతీ భావాన్ని
అక్షర రూపమిచ్చి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించేది కలము..
అక్షరాలకు అందాలనిచ్చే
యంత్రాలెన్ని వచ్చిన
తలరాతలను మార్చే సంతకానికి విలువనిచ్చేది కలం..
మోడు బారిన హృదయాలలో
ప్రేమ చిగురులను తొడిగించేది కలము..
ఆత్మ న్యూనతతో బాధపడే
మెథళ్ళను పదునుపెట్టి ధైర్యాన్ని నింపేది కలం..
గురువు చేతిలో స్థిర నివాసమేర్పర్చుకుని
ఎందరో మేధావులను తయారు చేయాడానికి ఆధారమైనది కలం...
బ్రహ్మరాతని కూడ
కృషితో కష్టపడే వారి చెంత చేరి..తలరాతలను అధ్భుతంగా తీర్చిదిద్దగల
మహిమ గల ఉలి..మన కలం..