స్నేహ బంధం
స్నేహ బంధం
ఏమిటో ఆ బంధము ఎదురుపడగానే
ఎదో ధైర్యం ...
ఎవరేస్ట్ నైనా పిల్ల పర్వతము ఎక్కినంత సునాయాసంగా
ఒక చుక్క స్వేదము కూడ నేల రాలకుండా ఎక్కగలననే మనో ధైర్యము నాలో ఉప్పెనలాఎగిసిపడుతుంది .
ఒక్క సారిగా కాలచక్రము నాపై కర్మ సిధ్ధాంతమంటూ
అర్థం కాని ప్రవచనాలను
శరములుగా విడిచి పెట్టి యుధ్ధం ప్రకటించినప్పుడు
నీను ఆహ్వానించకుండా
మేరు పర్వతములా ఎదురై
సహస్ర ఏనుగుల బలము నాకు ప్రసాదించి నన్ను వీర
ుడిని చేస్తుంది...జీవితమనే రణరంగములో...,
ఆటంకాలను జయిస్తూ లక్ష్యాలను చేధిస్తూ విజయపతాకాలను ఎగురవేసే క్షణాన నాలో భాగమై
నింగి,నేలా ఏకమైయ్యాలా
ఓ అందాల హరివిల్లునే నిర్మిస్తుంది...,ఈ బంధం
నిజమే ఈ బంధము
ఎంతో పవిత్రమైనది..నిప్పుకన్నా
ఈ బంధము ఎంతో బలమైనది-వజ్రము కన్నా..
నమ్మకమన్న మాటకు నిలువెత్తు నిదర్శనమే
ఈ స్నేహబంధం..
స్వార్ధమెరగని నిస్వార్థ బంధమంటూ ఒకటుందంటే సృష్టిలో .,అదే స్నేహబంధం..