గురజాడ అప్పారావుగారు
గురజాడ అప్పారావుగారు
ఏ జన్మ బంధమో!
ఏ జన్మ ఋణమో!
ఏ జన్మ పుణ్యఫలమో!
మా విజయనగర కళల
సౌధములో వికసించిన
కవితా సుమగంధం
మహాకవి గురజాడ.....
నాటి సాహిత్యానికి
తన రచనలు మకుటాలై..
ఆ మకుటకాంతులు కాంతిలీనమై..
ప్రపంచమంతా అసాంఘికమైన
అజ్ఞానపు తిమిరాలు ప్రారద్రోలుతున్నాయి...
నాటి భయంకరమైన
సాంఘిక ఆచారాలను,
నాటి దురాచారాలను
రూపుమాపుటకు
మీ కలమే ఓ ఆయుధమైనది..
మీ రచనలే ఫిరంగీలై
నాటి సమాజముపై
యుధ్ధశంఖం
e="color: rgb(0, 0, 0);">పూరించాయి..,
కన్యాశుల్కం,
పుత్తడిబొమ్మ
పూర్ణమ్మ వంటి రచనలు
నాటి సమాజ స్థితిగతులకు
ప్రతిబింబాలు...
ఆధునిక కవిత్వముకి
ఊపిరిపోసి...
నాటి సమాజములో
సాంఘిక దురాచారాలపై
తన కలము నుండి తన భావాలను
చురకత్తుల్లా వదిలి సమాజాన్ని
సంస్కరించిన సంఘసంస్కర్త
మహాకవి గురజాడ అప్పారావు గారు..,
నాటికి..నేటికి..ఏనాటికి...
ప్రజల హృదయాలలో
చిరస్థాయిగా నిలిచే
మహోన్నతవ్యక్తి...వక్త...
రచయిత..సంఘసంస్కర్త
మన గురజాడ..