మొబైల్
మొబైల్


ఓహో...ఏమి దీని హొయలు
లింగ భేదం లేకుండ
రింగు రింగు మంటూ
ఒయ్యారి పాటలు పాడుతూ
తన వైపు తిప్పుకుంటుంది
నూతనంగా తయారయ్యీ...
ఏంటో దీని తీరు చూస్తుంటే
మనుషుల మధ్య దూరాన్ని
తగ్గిస్తుందో...
కాలాన్ని హరిస్తుందో...
బంధాలని కలుపుతుందో..
అనుబంధాలని ఆవిరిచేస్తుందో..
అరాచకాలని బయటపెడుతుందో..
దుష్టాలోచనలను రగుల్చుతుందో...
మాయామంత్రములా క్షణములో
వైకుంఠానికి తీసుకువెలుతుందో..
తేలిన మబ్బులా అరచేతిలో
వైకుంఠాన్ని చూపిస్తుందో...
తల్లిదండ్రుల ప్రేమని
స్వేఛ్ఛా రూపంలో బలిచేస్తుందో..
విజ్ఞానంతో పరుగులు తీసే
యువతని అజ్ఞానంలోకి నెట్టివేస్తుందో..
నాలుగు గోడలకే బంధీ అయిన
నైపుణ్యాలను,
ప్రపంచ పూథోటలో
పరిమళాలను పూయిస్తుందో..
మరుగున పడిన
ఘరాన మోసాలను
బయటపెడుతుందో...
మేకవన్నే పులిలా
మంచితనపు ముసుగులో
చాప క్రింద నీరులా
ప్రాకే అరాచకాలను
గొంతెత్తి చాటుతుందో..
కట్టుబాట్లుకి బంధీ అయిన
క్రూర లక్షణాలను నిద్రలేపుతుందో...
తెలియని అయోమయస్థితిలోకి
ప్రపంచాన్ని దిగజార్చి...
నెలల పిల్లలు నుండి
పండు ముసలి వారి వరకు
వశపరుచుకుని...
తన సాధనాల కిరణాలతో
ప్రపంచ జీవన ఆయుష్షుని
సైలంట్ కిల్లర్లా పాకి
హరించివేస్తుంది...
నేటికి మించిపోయినది లేదు
చేతులు కాలేక ఆకులు పట్టుకునే
బదులు...
జీరో సైజ్ మొబైల్ సంకెళ్ళ
నుండి మీకు మీరే
విముక్తులు కండి...
ఆరోగ్యకర ప్రపంచాన్ని
నిర్మించడానికి సన్నధ్ధులు కండి...