STORYMIRROR

Satya Rachapothu

Comedy

4  

Satya Rachapothu

Comedy

నాలోని భావాలు

నాలోని భావాలు

1 min
386

నాలోని భావాలు


ఓయ్...!

నిన్నే.........!

ఎటెళ్ళిపోయావ్...!?

ఉన్నావా ఇక్కడే...? 

మరేంటి..? నీ హృదయస్పందన నాకు వినిపించట్లేదు...?

నువ్వు నాకు కనిపించట్లేదు....? హా...!


నీకు తెలుసా.... నేను నా భావాలను ఎందుకు ప్రకటిస్తానో....?!

నీకు తెలుసా.... నేను ఊహాలోకంలో ఎందుకు విహరిస్తానో...?!

ఎందుకు నీలా ఆలోచిస్తానో...?!


నీకోసమే .....! నీకోసమే.....! కేవలం నీకోసమే....!


హేయ్............. !వినిపిస్తోందా....? (గీతాంజలి సినిమాలో అరిచినట్టు) 


ఆ ఊహాలోకంలో ఉన్న నిన్ను అందుకోవడానికీ..., నా ఆలోచనలతో నీ ఆలోచనల్లో కలిసిపోవడానికీ... 

నా భావాలతో నిన్ను నా గుండెల్లో బంధించుకోవడానికి...(ఇది మాత్రం సీరియస్ పక్కా) మరి నువ్విలా స్పందించని శిలలా ఉంటే నా భావాలు నిన్ను చేరాయో లేదో నాకెలా తెలుస్తుంది చెప్పూ....!? అంటే.. నీ పనులు మానుకుని నా పిచ్చి రాతల్ని పొగడమని కాదూ....అలాగని నావి పిచ్చిరాతలనీ కాదు.


అంటే... నీకు పొగడడం చేతకాదని దెప్పిపొడవడం నా ఉద్దేశం కాదూ... అలాగని నువ్వు పొగిడితే నేను వినననీ కాదు.

అంటే.... నీచే పొగిడించుకోవాలని నా తాపత్రయం కాదూ...నువ్వు పొగడ్త పేరుతో శుభోదయం, శుభరాత్రిలు, చెబితే నాకు చిర్రెత్తుకొస్తుందని నీకు తెలీదనీ కాదు.


అంటే... అతిగా పొగిడితే నేను ఊరుకుంటానని కాదూ... పొగడకపోతే పగబడతాననీ కాదు.


అంటే.... పైకప్పు పైకెగిరిపోయేలా కాలింగ్ బెల్ కొట్టమని కాదు.. ప్రతిరోజూ ఇక్కడ నా భావాలను రాస్తాను కదా... అనునిత్యం పరిశీలించచ్చు, నీ అభిప్రాయం ఆ భావాల కిందరాయచ్చు కదా... నన్ను అనుసరిస్తూ(ఫాలో అవ్వచ్చు కదా అని ) అయ్యో.... రామచంద్రా..... ఎలా ఆపాలో..? ఎక్కడ ఆగాలో కూడా తెలియట్లేదే....?


ఏం చేయాలి రా దేవుడా.....?!


ఉన్నావా....? అసలున్నావా.....?

ఉంటే కళ్ళు మూసుకున్నావా..?! ( మంచి పాట వేసుకొని మనసులో)

ఉంటే నా బాధేంటో .నీకు అర్థం అయ్యేలా చెప్పచ్చు కదా.......?!

నా అవస్థ చూసి అలా ముసిముసి నవ్వులు రువ్వుతూ దూరంగా నిల్చుని చోద్యం చూడకపోతే... హు....!

# సత్య $


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar telugu poem from Comedy