జ్ఞాపకాలు
జ్ఞాపకాలు
కాలాలు మారిన...
సంవత్సరాలు గడిచినా.....
నా కలలు కల్లలైన....
నాలోనే నీవున్నావు... అనే నిజం
నా ప్రక్కనే నీవు లేకున్నా ...
నీ మాటలతో కాలమే కరిగి
నా వెన్నంటి నీవు నడవకున్నా ....
ప్రతీ భావం నాలో కదిలి
నా నీడలా ఎప్పుడూ నావెంటే ఉన్నావు...
అన్నది నిజం
నేను శ్వాసించే ప్రతి శ్వాసలో .....
నా ఆదరాలపై మెరిసే చిరు హాసంలో .....
నా వర్షించే ప్రతి కన్నీటి బొట్టులో నీవున్నావు....
నా ఎదుట నీవు లేకున్నా....
నా హృదయపు కోవెలలో
నిత్యం కొలువుంటావు
ఏకాంతంలో ఉన్నా...,
పదిమందిలో నేనున్నా...
సదా నీ జ్ఞాపకాలు ....
నన్ను దహించి వేస్తూనే ఉంటాయి
నా కవితలకి ప్రాణం నీవు ....
నా ప్రాణానికి రూపం నీవు ....
ఉదయించే రవికిరణం నీవైతే ...
అస్తమించే సూర్యకిరణమై నేను...
నీ జ్ఞాపకాలే నా ప్రాణవాయువుగా...
నీకై నా ప్రయాణం సాగుతోందిలా....
నిన్ను మరిచేక్షణం అంటూ ఉంటే....
నా ఊపిరి ఆగే చివరి క్షణం అవుతుంది .
#సత్య $
