STORYMIRROR

ARJUNAIAH NARRA

Fantasy

4  

ARJUNAIAH NARRA

Fantasy

నేనొక కవిని, పదాల గనిని

నేనొక కవిని, పదాల గనిని

1 min
616


నేనొక కవిని, పదాల గనిని

నిరంతర అన్వేషిణిని,సత్యాన్వేషినిని

కాలంతో పోరాడాటానికి వెనుదిరగని యోధున్ని

అనుభవాల సారాన్ని కలంతో పంచే ఋషిని

చావు బతుకుల మధ్యన ప్రాణం పొసే సంజీవణిని

నేనొక కవిని......... పదాల గనిని.....


నా కవితలను.....

వసంతంలో వలపు ఓనమాలుగా దిద్దాను

గ్రీష్మంలో గీతోపదేశంగా గావించాను

మాఘమాసంలో మాధుర్యంగా చిలికించాను

హేమంతఋతువులో వెన్నెలగా కాశాను 

ఎందుకంటే నేనొక కవిని......... పదాల గనిని.....


నా కవితలను......

అనురాగాలకు, అనుబంధాలకు 

ప్రేమబంధాలుగా పెనవేసాను

వైర్యగానికి విరుగుడుగా 

ప్రణయ రాగాలుగా అలపించాను

ఎందుకంటే నేనొక కవిని......... పదాల గనిని.....


నా పదాలు....

చిన్న పిల్లల మోముపైన చిరునవ్వులవుతాయి

కన్నెపిల్లల పాదాలకు కాలి అందెలవుతాయి

వివాహిత మెడలపైన దాంపత్య సూత్రాలవుతాయి

అలసిన వృద్ధుల గుండెల్లో ఉపిరిలవుతాయి

ఎందుకంటే నేనొక కవిని......... పదాల గనిని.....


నా భావాలు.......

యువతి యువకుల మదిలో

ప్రేమ పూలుగా విర పూస్తాయి

విడిపోయిన జంటల హృదయంలో

ఒక్కటిగా కలిసిపోయే గమ్యలవుతాయి

ఎందుకంటే నేనొక కవిని......... పదాల గనిని.....


నా సిద్ధాంతాల్లో.......

అన్యాయాన్ని ఎదిరించే ఎదురు ప్రశ్నలున్నాయి

అక్రమార్కుల గుండెలకు సందించే అస్ర్తాలున్నాయి  అవినీతికి గుబులు పుట్టించే గుణపాటాలున్నాయి

మార్పు కోరే వారి కోసం మనవత్వపు పరిమాళలున్నాయి

ఎందుకంటే నేనొక కవిని......... పదాల గనిని.....


Rate this content
Log in

Similar telugu poem from Fantasy