లేత ప్రాయం
లేత ప్రాయం
నా లేత ప్రాయమంటే అతనికి చచ్చేంత ఇష్టం
అతని వయసు గాలం నా వలపు నిధులన్నీ లాగేస్తాయి
అతని చూపులు పూర్తిగా విప్పారని నా పదహారేళ్ళ
ప్రౌఢ అందాలను దండయాత్ర చేస్తుంటే
తన దేహ వర్చస్సు నా సర్వాంగ సుందర
సుకుమార తనువును ప్రకంపంనం చేస్తది
అతని చిలిపి చేష్టలు నాలో చిరునవ్వులని పుట్టిస్తాయి
నా చూపులు అతని కళ్ళను పెనవేసుకున్నపుడు
తన శ్వాస నా మనసులో కోరికలు రేపుతుంది
వేడి ఆధరాలతో నా బుగ్గలో వేడి సెగలు పుట్టిస్తాడు
తన స్పర్శతో నా అణువణువులు చెమ్మగిల్లుతాయి
అతని బిగికౌగిళ్లు వెచ్చతనాన్ని పంచుతుంటే
తన స్వరం నా చెవిని చేరి హృదయాన్ని
గిలిగింతలు పెడుతది
తన చేతులు నా గుండెల మీద నాట్యం చేస్తున్నప్పుడు
అతని నాలుక నా రసరమ్య వాంఛలను స్పృశిస్తాయి
తన ప్రేమ తరంగాలతో చిన్నీ అలకలను పోగొట్టి
నా సిగ్గులను దోచుకొని నన్ను పీల్చి పిప్పి చేస్తాడు
అందుకే అతనంటే నాకు చచ్చెంత ఇష్టం
తన పిల్లనగ్రోవి స్వరాలకు మయురిలా నృత్యం చేస్తా
ఆకలిగొన్న కళ్ళకు అమృత కలశం నవుతా
తడి ఆరిన పెదాలకు తీయ్యని తేనేనవుతా
తన దప్పిక గొన్న కోరికలకు దాహాన్ని తీర్చే కొనేటీనవుతా
తన వంపులు తిరిగిన కండలలో అస్త్రంలా వొదిగిపోతా
తన చేతుల్లో విరిసిన విరజాజి పూల మాలికనవుతా
తన వక్షముపై బంతి చామంతుల పూలచెండునవుతా
తన హృదయ కోవెలలో దేవతనై కొలువుంటా....
*******************
సూదూరం నుండి సమీరం సినీ సంగీతాన్ని
లీలగా మోసుకొస్తున్నది
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..

