STORYMIRROR

తాళ్ళ శ్రీ

Romance Fantasy

4  

తాళ్ళ శ్రీ

Romance Fantasy

మళ్ళీ ప్రేమలో పడ్డాను

మళ్ళీ ప్రేమలో పడ్డాను

1 min
264


ఒకప్పటి భగ్న ప్రేమికుడినైన నేను

ప్రణయ తాపపు విరహ బాధను

కావ్య భాషలో వర్ణించి

కవితాత్మక మత్తులో...విహరించాలని తపిస్తుంటే


ఎప్పుడైతే నీ అందాన్ని వీక్షించానో కానీ

మనసుకు మరో ధ్యాస లేకుండా 

నీ రూపం నిద్ర రాకుండా చేస్తుంది


గుండెల్లో నిండిన నీ రూపాన్ని

మది ప్రతి క్షణం వీక్షిస్తున్నా...కానీ

నీ పలకరింపుకై పరితపిస్తుంది ప్రియతమా


సమయాన్ని మరిపించే...

నీతో సంభాషణలో ఏం మాట్లాడుతానో తెలియదు

కానీ ఇంకా...ఏదో మాట్లాడాలి అనిపిస్తుంది


నువ్వు హాయ్... అంటే చాలు

మనసెంతో...మురిసిపోతూ హాయిగా 

ఎన్నో వేల భావనలో మునిగి తేలుతుంది


నిను ప్రేమిస్తున్నా అనేది భ్రమ కావొచ్చు కానీ

నిను ఎప్పుడు నాకు నచ్చినట్టు చూపిస్తుంది

నిను ఎప్పుడు నా పక్కనే నడిపిస్తుంది

నీ మాటల్ని వింటు నీ చూపుల్లో చిక్కి

పూర్తిగా నీ కౌగిలిలో బంధి అవ్వాలనేంత ఆర్థ్రత

నాలో కలిగిస్తుంది


మరోసారి ప్రేమలో పడ్డానేమో అనిపిస్తుంది

కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు

ఎందుకో...తెలియదు కానీ రోజు రోజుకు

నీకై నా ఆలోచనలు విస్తృతమౌతున్నాయి

బహుశా ఇదంతా ప్రేమే అయితే...

లవ్ యూ బంగారం 

నీ ప్రేమను మాత్రం నే ఆశించనులే...


Rate this content
Log in

Similar telugu poem from Romance