STORYMIRROR

తాళ్ళ శ్రీ

Romance Fantasy

4  

తాళ్ళ శ్రీ

Romance Fantasy

తుషార తడి

తుషార తడి

1 min
310


తెలవారె సూర్యుడి వెచ్చని స్పర్శకై...

ప్రకృతి అంతా... తుషార తడితో... ఎదురు చూస్తుంటే

ఒక్క కిరణపు తాకిడికి లోకమంతా పుష్పమై విచ్చుకున్నట్టు

నీపై ప్రణయ కాంక్షలతో...నా మదికి తెలవారేది ప్రియా


నీ అందాన్ని

అదే... నన్ను చూసే‌ నీ కనుల వంక

నెలవంక తీరు వీక్షించి 

వీనుల విందుగా ఎంతటి ఆనందం అనుభవించేదో మది

తలుచుకుంటే...మనసు పరవశిస్తుంది


నిన్న చూసినప్పుడు కన్న...

చూడలేక పోతున్న అనే ఓ రకమైన భావమే 

భరించరాని వేదనలా అనిపించేది


ఒంటరి మనసులో ప్రేమకు

ఓటమి అనేదే లేదని సంతోషించా...

కానీ... ఒంటరి మదిలో మెదిలే

జంట కలలు భరించలేనంత బరువుగా అనిపిస్తాయని

నువు తోడుగా లేకపోతే తెలుస్తోంది బుజ్జి


ప్రేమంటే...

ఒకరిని ఒకరు ఆక్రమించి సొంతం చేసుకోవడం కాదు

ఒకరిలో ఒకరు నిండిపోయి...

ఒకరి జ్ఞాపకాలలో ఒకరు జీవించడం అని

నువు నా తోడుగా లేనప్పుడు తెలుస్తుందే...


ఎంతో మంది అంగనల అందాలు చూశా కానీ

నాపై అలిగే...నీలాల...కన్నుల పిల్ల వైన

నిన్ను తలపించేలా...ఏ ఒక్కరు కానరావడం లేదే


ఒక్కసారి...

ఒకే ఒక్కసారి నీతో... మనస్ఫూర్తిగా మాట్లాడాలేమో ఇప్పుడు అనిపిస్తుంది

నీ పాటికి నువు... నన్ను ప్రేమలో ముంచేసి వెళితే

నన్నుకాపాడే కన్నె మనసునైనా పరిచయం చేయవే

అని అడిగాలి అనిపిస్తుంది



ఆమె రాకపోతే...

తను నా జీవితంలో లేకపోతే అనే ఆలోచనే రాలేదు ఇన్నాళ్లు

ఆ ఒక్క ఆలోచన వచ్చి ఉంటే...

ఇప్పుడు ఆమెని దూరం చేసుకునే వాణ్ణి కాదేమో

ఆమె అనే కన్న తను అంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది


తను ఎప్పుడూ...

నాతోనే ఉన్నట్లు

నాలోనే ఉన్నట్లు అనుకుంటూనే

తెలియని ఒక భ్రాంతిలో... అదే ప్రేమలో ఉంటున్న




Rate this content
Log in

Similar telugu poem from Romance