STORYMIRROR

తాళ్ళ శ్రీ

Romance Fantasy

4  

తాళ్ళ శ్రీ

Romance Fantasy

మదిలో ఉన్న నువ్వు

మదిలో ఉన్న నువ్వు

1 min
236









మదిలో ఉన్న నువ్వు

ఎదపై చేరేసరికి

ఏం మాట్లాడుతున్నానో

ఏంటో...

పచ్చిగా ప్రవర్తిస్తున్నానో...

పిచ్చిగా ప్రేమిస్తున్నానో

కానీ నాలో నీపై ప్రేమనంతా

నీ ముందు ఉంచేందుకు

మది సంద్రంలో ఎగిసిపడే ఆలోచనల అలల మధ్య

నిశ్శబ్దంలో మన మనసులు మాట్లాడుకునేందుకు

వీలుగా నాలో బంధించిన ఊహలను

స్వేచ్ఛగా విహరించేందుకు అనుమతి యిచ్చానేమో

వెచ్చని‌ నీ కౌగిలిలో

నన్ను నేను మరిచిపోయి

నువ్వే లోకంగా...ప్రేమ భావనను

ఆపాదమస్తకం అణువణువు పులకించి పోయేలా

ఆస్వాదిస్తూ... ఎప్పుడు రుచి చూడని

సరికొత్త ప్రణయ ప్రయాణపు

ఆనంద విహారంలో...

విరహానికి విమోచనం కలిగిస్తూ...

ఏకాంత హృదయాల ఆకాంక్ష తీర్చేలా

అద్భుత క్షణానికీ ఆహ్వానపు స్వాగతం పలుకుుదాం



Rate this content
Log in

Similar telugu poem from Romance