☉మనసు లేని ప్రేమకై☉
☉మనసు లేని ప్రేమకై☉
అక్షరం విలువ తెలుస్తున్న రోజుల్లో
లక్షల మంది రాసిన
పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించాను
కానీ!
ప్రేమవిలువ తెలిశాకా...
నాకు నేనుగా
నాతో నేను పోటి పడి రాసిన
ప్రేమ పరీక్షల్లో ఎన్నో సార్లు విఫలమౌతున్నా
అయిన సిగ్గు విడిచి మరోమారు ప్రయత్నానికి సిద్దపడ్డాను
కాని!
తర్వాత కాలానుభవంలో తెలిసింది
అక్షరపు పరీక్షలో
మన మేధస్సు కు
పరిశీలించే వారి ఉత్తమ మేధస్సు తో నిర్ణీతమేరకు సరితూ గితేనే
సఫలమవుతామని
అలాగే
నా ప్రేమ పరీక్షలో కూడా
నా మనసుతో జతకట్టే వారికి
ఉత్తమ మనసు లేకపోవడం
నా అభ్యర్థనలను పరిశీలించే అర్హత లేకపోవటంతో
నేను విఫలమవుతున్నానని తెలిసింది అందుకే !
నా అమూల్యమైన అపారమైన ప్రేమను స్వీకరించే అర్హత లేనివారికై
పరీక్షల్లో అభ్యర్థి గా వుండటం నాకేమాత్రం యిష్టం లేదు
అందుకే! నేను వెతుకుతూ పోయే ఎండమావి కన్నా
నన్ను వెతుక్కుంటు వచ్చే వాన చినుకు చాలు అని
ప్రేమకై ఆరాటం పడకుండా
మనసులేని మనిషిగా బ్రతకటమే మేలని
నిర్ణయించుకుని
ఎవరో ఒకరికి మాత్రమే ప్ర్రేమను యిచ్చి జంట కట్టడం కన్నా
అందరికి ప్రేమను పంచి ఒంటరిగా వుండటం ఉత్తమంగా భావించాను దానినే ఆచరించాను
-తాళ్ళశ్రీ
