ప్రేమవిరహం
ప్రేమవిరహం


మనసు ఉప్పెనై ఉరిమింది నీకోసమే!
వలపు వడివడిగా అడుగులు వేసింది నీకోసమే!
ప్రకృతి పదనిసలతో పలకరించినా,
మాటలు మౌనం చేరింది నీకోసమే!
ఆ చిగురాకులు చిరునవ్వులు విసిరినా,
అందని చుక్కనై అణువణువు దాచింది నీకోసమే!
మల్లెలు మనసిమ్మని మొరపెట్టినా,
ఎద ఎల్లప్పుడూ వేచింది నీకోసమే!
ఈ విరహ వేదన వీడి, నీ ఒడి చేరాలనే
నా కలానికి తెలియదు నా కవనానికి రూపం నువ్వని!