STORYMIRROR

Kadambari Srinivasarao

Fantasy

5  

Kadambari Srinivasarao

Fantasy

సూటిగా మాట్లాడుదాం

సూటిగా మాట్లాడుదాం

1 min
429

ఆత్మ గౌరవాన్ని

అంగండిలో సరుకులా

ప్రదర్శనకు పెట్టి 

నేను నటించలేను


కీర్తి కిరీటం ధరించడానికి

మానాభిమానాలను

తాకట్టుపెట్టి

నేను నటించలేను

సహజంగా పుట్టుకతో అబ్బిన సుగుణ రాశిని

అంగాంగ ప్రదర్శన పేరుతో ఆరబోతకు

నేను నటించలేను

మెప్పుల మేకతోలు

శాలువాల కోసం 

నియమాలకు నీళ్లొదిలి

నేను నటించలేను

కాసులకోసం కక్కూర్తి పడి 

కష్టాన్ని పంటికొనను బిగపట్టి

చిరునవ్వు ముఖాన పూసుకుని 

నేను నటించలేను

పరువే ప్రధానమై

మనసు మాటను 

శిరసావహించే నేను

డబ్బుకోసం గడ్డి కరచే

నటనకు ఎన్నటికీ దూరమే!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy