స్నేహానికి చిరునామా
స్నేహానికి చిరునామా
పరువుకన్న బరువులేదు..వదిలిచూడు తెలుస్తుంది..!
నీతో నీకే గొడవా..నవ్విచూడు తెలుస్తుంది..!
కాలి బూడిదైనా సరె..కాలనిది అహంకారం..
సత్యమిదే ఓ నేస్తం..ఆగిచూడు తెలుస్తుంది..!
చిత్తశుద్ధి బహుమతిగా..ఎవరికెవరు ఇస్తారోయ్..
ఆలోచనమాటు సరిగ..చేరిచూడు తెలుస్తుంది..!
విశ్వంలో కణకణమూ..దివ్యజ్ఞాన మందిరమే..
అంతరంగ సంద్రమునే..తఱచిచూడు తెలుస్తుంది..!
ప్రేమకావ్య రచనచేయు..అవసరమే లేదుకదా..
ప్రేమమయం జగమంతా..చదివిచూడు తెలుస్తుంది..!
స్నేహానికి చిరునామా..గుండెచాటునే ఉన్నది..
భావనయే మధురముగా..నిలిపిచూడు తెలుస్తుంది..!

