నీవు నేను
నీవు నేను
ఒప్పుకుంటాను
నీలా నేనుండలేను
నీకున్న నమ్మకం
నాదగ్గర లేదు
నాకు తెలుసు
నీకు ప్రతి విగ్రహంలో
దేవుడు కనిపిస్తాడు
దానిలో నాకందమైన
మట్టి కనిపిస్తుంది
నీవు గొప్పొడివి
దేవుడిమీదెంతో
భక్తితో వుంటావు
ఆ ఆశ నాకులేదు
నేనెంత కోరుకున్నా
నీ దారిలో రాలేను
నీవు నా మార్గంలో
ప్రయాణం చేయలేవు
నీవు మారాలని
నేను అనుకోను
నన్ను మార్చాలని
నువ్వు అనుకోవు
నీవు సమయాన్ని
ముక్తికి ధారబొస్తావు
నేను మనుషుల
విముక్తికి చేరవేస్తాను
నీకు రేపంటే భయముండదు
నాకు రోజంతా రేపటి గురించే
నీ కోర్కెలు దేవుడు తీరుస్తాడు
నాఆశలకోసం నేను జీవిస్తారు
పుట్టుక ఇద్దరికీ సమానం
చావు మన చేతుల్లో లేదు
మరణభయం నీకుండదు
నే భయపడుతూ జీవిస్తాను
చివరికి
మన ఇద్దరికీ కావలసింది
ఆరడుగుల నేల మాత్రమే
నీవు దేవుడిలో కలసిపోతావు
నేను మట్టిలో కలసి పోతాను

