ఏకాంతపు మందిరమే
ఏకాంతపు మందిరమే
దూకుతున్న సెలయేటికి..సంగీతం నేర్పేవా..!
అలజడి చెందిన నా మది..సంగతులే మార్చేవా..!
మాటల అర్థం తెలిసిన..మౌనం నీ దరహాసం..
అందని అందం చిందే..వెన్నెలనే దాచేవా..!
వేసవి విడిదిగ దొరికిన..నీ ఒడియే స్వర్గమందు..
మధువును వెదకే పెదవికి..మంత్రమేదొ వేసేవా..!
ఏకాంతపు మందిరమే..అక్షరాల గగనంలో..
ప్రతిభావన సీమలనే..సృష్టించగ నడిపేవా..!
నీ చూపే సంవేదన..మాన్పగల్గు ఓషధిలే..
అమృతమధుర ప్రశాంతతను..వర్షిస్తూ ఉండేవా..!
ప్రేమపంట పొలమంటే..నీ హృదయపు లోగిలియే..
చెలిమిపూల పరాగమై..అణువణువున దాగేవా..!

