కలలవరుస
కలలవరుస
కన్నులెదుటి వాస్తవమే..కరుగుతున్న కలలవరుస..!
పరుసవేది ఈ మనస్సు..పంచుతున్న కలలవరుస..!
ఈ పుడమియె దివ్యమైన..రంగస్థలి నీకోసం..
పులకలైన అలుకలైన..పొంగుతున్న కలలవరుస..!
నిప్పుపెట్టు వారుండరు..వాడని నీ తీపివాడ..
తీర్చుకునే యాతనలో..పెరుగుతున్న కలలవరుస..!
కలుగులోని జీవికున్న..ఎఱుకదెంత చిత్రమోయి..
తెలిసికూడ పొందలేక..ఊరుతున్న కలలవరుస..!
మాటలింటి అర్థాలను..వెతుకులాడు సంగతేమి..
ఒకపాటగ బ్రతుకలేక..మరుగుతున్న కలలవరుస..!
కాల్చుకోను వల్లగాక..కలతపడుతు జన్మలెన్నొ..
సత్యమెఱుక కలుగగాను..రాలుతున్న కలలవరుస..!

