కంకణబద్ధమైన రక్ష
కంకణబద్ధమైన రక్ష


తల్లి పేగును పంచుకు పుట్టిన రక్తబంధం
తన సోదరికి ఆలంబనగా
నిలిచే జీవితకాల రక్ష
దుర్మదాంధుల పాలిట
వజ్రాయుధమై చెలరేగి
ఆడబిడ్డకు అండగా నిలిచే రక్ష
తోడబుట్టిన బంధం
ఆరోగ్యసిరిని సూత్రబద్ధంగా కాంక్షించే
సోదరి కంకణ రక్ష
జీవితాన చీకట్లు ముసిరే వేళ
నేనున్నానని భరోసానిచ్చే
సోదర బంధం సోదరికి రక్ష
నేడు దుకాణాల దండెలపై
పిండి కొద్దీ రొట్టెలా
అలంకారమైన రంగు హంగుల రక్ష
ఆతతాయిల ఆట కట్టించడంలో
అతివలు వాడే దారపు పోగే
వారి పాలిట రక్షణాయుధం
రక్షాబంధనంలో పరిపూర్ణమైన ప్రేమ శక్తి
సోదరికి కవచమై నిలిచే దివ్యశక్తి