ఆమెకు ఆమే సాటి
ఆమెకు ఆమే సాటి


మాతృగర్భాన అవతరించిన మహాలక్ష్మి
తోబుట్టువులకు ఆత్మీయ సంపద
సమాజంలో తిరుగాడే సహనం
పురుష జీవిత పేజీలో చెరగని సంతకం
సకల విద్యల సాకారంలో అగ్ర పథం
సత్వ,రజ,తమో గుణాల మేలి కలయిక
సమతా, మమతలు పంచడంలో సాటిలేని మేటి
నిరంతర సేవలో నిరూపమన రూపం
పేగు పంచిసృష్టికి ఊపిరి పోసే బంధం
మహిళ అంటే మహోన్నత వ్యక్తిత్వం
మగని జీవన గాలిపటానికి ఆధార దారం
భారాన్ని బరువనక మోసే బంధం
ఆమె ఆగ్రహిస్తే మిన్ను ముడతాయి జ్వాలలు
అనుగ్రహిస్తే జాలువారతాయి శీతల జలపాతాలు
ఆమెకు ఆమే సాటి, ఆమెకు ఆమే పోటీ
ఆమె భద్రంగా ఉంటే అవని పచ్చగా తిరుగాడదా!