తృప్తికోసం వెతుకులాట
తృప్తికోసం వెతుకులాట


మనో సాగరంలో
కోర్కెల అలలు పడుతూ లేస్తూ
ఆతృతగా ఒడ్డుకు చేరతాయి
కానీ ఒడ్డుకు చేరిన ప్రతి అలా
అక్కడతో తృప్తి చెంది
వెనుకకు పోయి అదృశ్యమవదే!
అలా జరిగితే కోర్కెల సాగరం ఎండిపోదూ!
అది అంతకంటే పెద్ద అలగా
రూపు మార్చుకొని
మరింత వేగంతో ఒడ్డును చేరి
అక్కడ తృప్తి రూపుపొందుతుంది
జీవన నాటకం ముగిసేవరకూ
తృప్తికి శాశ్వత చిరునామా వెతకడం
దాహంతో ఉన్నప్పుడు
మృగతృష్ణలో నీరు తాగడం లాంటిదే!
చిక్కుపడిన బంధపు దారాల మధ్య
ఊపిరి ఆశల ఊయల ఊగుతూనే
చివరి శ్వాస వరకూ తృప్తికోసం వెతుకులాట
ఇదేగా! మనొసంద్రపు నిరంతర ఘోష