STORYMIRROR

Kadambari Srinivasarao

Horror

4  

Kadambari Srinivasarao

Horror

సాక్ష్యంగా నిలిచిన భారతావని

సాక్ష్యంగా నిలిచిన భారతావని

1 min
247

పాచికలాడిన విధి క్రీడ

కుతంత్రపు సమాలోచన బలంతో

అక్రమ విజయ కేతనం


ఫలితంగా అరణ్య వాసానికి

నెట్టివేయ బడిన

అమాయక పంచ పాండవం


కట్టుకున్న లక్క ఇంటిని పరశురామ ప్రీతి స్వాహాతో

అక్కడ కూడా నిలువ నీడ నీయని

అరాచక దుష్ట గణం


పదునాలుగేళ్ళ అష్ట కష్టాల వనవాసం 

ఒక వసంతం ప్రమాదభరిత అజ్ఞాత వాసం

దిగ్విజయంగా ముగించిన యుధిష్ఠిర కూటమి


ఐదూళ్లు సంతృప్తిపై నీళ్లు జల్లి

సూదిమొనకు కూడా తావివ్వక

కయ్యానికి కాలు దువ్విన కౌరవకిరాతకం


యుద్ధ ఖండూతికి బలైన

అక్షౌహిణులు కొద్దీ సేనలు

శత అధర్మ కుత్తుకలు తెగిపడిన క్షేత్రం


అధర్మం పై ధర్మ పోరాటం

తుది గెలుపు ధర్మానిదంటూ

సాక్ష్యంగా నిలిచిన భారతావని


Rate this content
Log in

Similar telugu poem from Horror