STORYMIRROR

ARJUNAIAH NARRA

Horror Tragedy Crime

4  

ARJUNAIAH NARRA

Horror Tragedy Crime

ప్రపంచంఒక కామక్రీడా రంగం

ప్రపంచంఒక కామక్రీడా రంగం

1 min
804

పాఠాలు బోధించే పంతుళ్ళు.....

ప్రణయ గీతాలతో పరవశిస్తున్నారు

లెక్చరర్స్....

కళాశాలను కామశాలలుగా మార్చుతున్నారు

ప్రొఫెసర్స్ ......

యూనివర్సిటీని 'యోని'వర్సిటీగా మార్చుకున్నారు 

బిసినెస్ దిగ్గజాలు...... 

ఆడవాళ్ళ అందాలతో వ్యాపారం చేస్తున్నారు

రాజకీయ నాయకులు పదవుల కోసం 

పడతులను పక్కలెక్కిస్తున్నారు 

అందరూ కలసి మహిళను ప్రపంచ మార్కెట్ లో  

అంగడి సరుకుగా మార్చివేశారు


ప్రవచనాలు పలికేటోళ్ళు పరువాలను తడుముతున్నారు 

బైబిల్ ని బోధించే టోళ్ళు పాపాల పేరుతో 

పాపలను తాకుతున్నారు 

గుడిలో పూజారిలు హ'రతి' పూజలు చేస్తున్నారు 

ముళ్లాలు (mullah) పరదా పడతులతో పక్కలు వేస్తున్నారు

మతపెద్దల మంటూ మానభంగాలు చేస్తున్నారు

స్వామిజీలు వివిధ బంగిమలలో భామలను

యోగసనాలతో యోగినిలుగా అవతారమిస్తున్నారు

బాబాల విభూదిలో బయటపడుతున్న బాగోతాలు


అది ఇళ్ళులైన, ఆఫీస్ లైన, థియేటర్ లైన, 

స్కూల్స్ కాలేజీలైన, యూనివర్సిటీలైన

సముద్ర తీరాలైన, ఎడారులైన, 

మంచుగడ్డలైన, మహా పర్వతాలైన, 

అది హాలివుడ్, బాలీవుడ్,టాలీవుడ్ రంగాలైన

దేవాలయాలైన, చివరికి శ్మశాన వాటికలైన....


ఎటు చూసిన ఏమున్నది గర్వకారణం

మగవాడన్న అహంకారం

పండు వయసులో కూడా తొలగని కామావికారం

అవనిలో వనితల బతుకులయ్యెను అంధకారం

పాలుగారే పసిపిల్లల నుండి 

పాడెకి దగ్గరున్న అవ్వల వరకు

ప్రతి ఆడది ఒక ఫోర్న్ స్టార్ ల 

వాడబడి ఒడేను బతుకు సమరంలో

ఈ ప్రపంచమంత ఒక కామక్రీడా రంగం

అన్నలైన, నాన్నలైన, బాబాయిలైన, మామలైన, 

ప్రతి మగవాడు స(మ)హానటులే ఈ బతుకు నాటకంలో



Rate this content
Log in

Similar telugu poem from Horror