రక్తపు మరక
రక్తపు మరక
నేను పరుగెడుతున్నాను
ఎంత పరుగెత్తినా ఇల్లు కనబడడం లేదు
కొంప తీసి మా ఇల్లు కానీ అలిగి ఎక్కడికయినా వెళ్ళిందా
దారంతా కుళ్ళిన శవాల వాసన
కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనబడని చీకటి
ఎక్కడ చూసినా ఎర్రటి రక్తపు మరకలు
నా షర్ట్ దానిపాటికదే చిరిగిపోయింది
మెల్లిగా ఎవరో నా ఛాతీని తడిమిన భావన
ఒళ్ళు గగుర్పొడుస్తోంది
అయినా నేను ఆగలేదు
రొప్పుతూ పరుగెడుతున్నా
ఒంటి మీద బట్టలు లేని భావన
అదిగో మనుషులు
కాదు కాద
ు
ఆదిమానవులు
బట్టల్లేకుండా
నాలాగే
నాకు భయం వేసింది
ఇంకా పరుగెడుతున్నా
భయం వేసింది
ఇంకా పరుగెడుతున్నా
మెట్లు వచ్చాయి
ఎక్కుతున్నా
పడిపోతున్నా
ఎవరో నన్ను లాగుతున్న భావన
అదిగో
చీకటి గది
అందులో నన్ను బంధించారు
లైటు వేశాను
ఇది నా గదే
నా ఒంటి మీద బట్టలున్నాయి
నా ఛాతీ మీద రక్తపు మరకలున్నాయి
ఇదంతా నిజమా
లేక
భయానక స్వప్నమా