STORYMIRROR

ARJUNAIAH NARRA

Horror Tragedy

4  

ARJUNAIAH NARRA

Horror Tragedy

నీ ద్రోహం!

నీ ద్రోహం!

1 min
335

నీ ద్రోహం నన్ను రాచపుండులా రోజు తింటున్నది

నీ ద్రోహం నన్ను కరోనలా వెంటాడుతోంది 

నీ ద్రోహం నన్ను కిడ్నీలో రాయిలా మెలిపెడుతిన్నది

నీ ద్రోహం నన్ను గుండెలో నొప్పిల వేదిస్తున్నది

నీ ద్రోహం నా మనసులో మంటలు రేపుతోంది

నీ ద్రోహం నన్ను అగ్నిపర్వతంలా దహించివేస్తున్నది


నేనిప్పుడు శుష్కించి పోతున్న వృద్ధ కాయాన్ని

నేనిప్పుడు ఆలోచనలతో రగులుతున్న నిప్పు కణికను

నేనిప్పుడు కోన ఊపిరిలో కొట్టుకుంటున్న దీపాన్ని

నేనిప్పుడు మమతల మంటల్లో కాలిపోతున్న 

నేనిప్పుడు అనురాగపు జ్వాలల్లో ఆహుతి అవుతున్న

ఇప్పుడైనా నీ జ్ఞాపకాల ఊబిలో దాగున్న 

నిజాన్ని బయటకు తీసి కాలిపోతున్న

నా మనసును బతికించవా ప్రియ!


ఎందుకంటే.....

ఎప్పుడు నీకోసం కొట్టుకునే గుండె 

ఈ క్షణం ఆగిపోతా అంటున్నది

ఇప్పటికే మూడుసార్లు మరణ మృదంగం 

మ్రోగించానన్నది.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Horror