STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Horror Tragedy Crime

4  

Thorlapati Raju(రాజ్)

Horror Tragedy Crime

పిరికిపంద..(ఉగ్రవాది)

పిరికిపంద..(ఉగ్రవాది)

1 min
235

పిరికిపంద..(ఉగ్రవాది)


అరుపులు..ఆర్తనాదాలు..అర్ధించటాలు..

కళ్లెదుటే..కన్న పిల్లలు..

కన్నవారు కడతేరుతుంటే 

ప్రకృతి వైపరీత్యమా..

అయ్యో పాపం అనుకోవటానికి..కాదే!

కసాయి నాయాళ్లు

కోపోద్రేకంలో రాసిన రక్త చిత్రం!


సాటి మనిషిని

పగతో..కసితో 

కోసి కోసి.. కాల్చి కాల్చి

చంపే వాడు ఏ మతస్థుడు?


మతాలన్నీ మంచినే చెబుతున్నాయే

అహింసనే ప్రభోదిస్తున్నాయే 

మీరు తీర్చుకొనే రక్త దాహానికి

మతమనే పేరెందుకు?


ఇక్కడే తేటతెల్లమవుతుంది

మీరెంత పిరికి పందలో అని

మీరెంత అసమర్ధులో అని

ముసిరిన చీకటి పొరలను తీసి చూడండి


వందమందిని హతమార్చటానికి

ఒక్క అసమర్థుడు చాలు

అదే ఒక్కర్ని బతికించటానికి..

వందమంది నిపుణులైనా..చాలకపోవచ్చు

ఏది అత్యంత కష్టం?

ఏది మన సామర్థ్యాన్ని తెలుపుతుంది?

చంపటమా..ప్రాణం పోయడమా!

అంత్యంత సులువైన పని చేసి

చంకలు గుద్దుకునే మీరు

చేత గానీ వాళ్ళా..చేవ గలిగిన వాళ్ళా!


కాలనాగు అనుకొందట..

కసితీరా కాటేసానని

వందమందిలో..

ఒకరిద్దరిని కాలారాయ వచ్చది

అందరిలో భీతిని కూడా కలిగించవచ్చు కానీ


చలి చీమలన్నీ..

భయముతోనో.. బాధతోనో

కలిసేది ఒకచోటేనని

తిరిగి..తిరగబడి

తరిమి తరిమి.. తగలబెడతారని

కళ్ళు లేని కాలనాగుకి కానరకపోవచ్చు!


నిత్యం మారణాయుధాలతో 

మసలే వాడు..అసురుడు

త్వరపడండి..

జనంగమా.. మంత్రాంగమా యంత్రాంగమా

అసురులను..

మనుజుల్లో రాకాసి బల్లులను

మట్టుపెట్టండి.

             

            ...రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Horror