కాళరాత్రి
కాళరాత్రి


ఈ నిశీత నిశ్శబ్దంలో
కాళరాత్రి వేళలో
చూసాను గగుర్పొడిచె
వికృత రూపం //ఈ నిశీత //
ఆర్తనాధాలు, రోదనలు
భయంకర సన్నివేశాలు
మనసులు చెదిరి
బంధములే విడిపోయె //ఈ నిశీత //
హాహాకారాలు
భయానక కాటి దృశ్యాలు
కాలుతున్న శవాలు
శునకముల అరుపులు //ఈ నిశీత //
పిశాచముల ప్రేతాత్మల అలజడి
గుండెలదిరె ధ్వనులు
కాటిలోన కాలి బూడిదై
ఎముకలే మిగిలె చితిలోన //ఈ నిశీత //
కలిసె భస్మంబు గంగ లోన
మిగిలె కడసారి జ్ఞాపక వీడ్కోలు
మునిగె చివరి తర్పణములీయ
కాశీ, ప్రయాగ త్రివేణి సంగమంలో //ఈ నిశీత //