STORYMIRROR

pravalika vadlakonda

Horror Thriller Others

4  

pravalika vadlakonda

Horror Thriller Others

ఎవరునువ్వు??

ఎవరునువ్వు??

1 min
289

నేను ఎక్కడున్నా నా కళ్ళు నిన్నే వెతికాయి

 నువ్వు నన్నే చూస్తున్నావని అవి నమ్మాయి

 నిన్ను తిరిగి చూడాలని ఉన్న ,చూసే  ధైర్యం లేదు

 భయంకరమైన శబ్దాల మధ్య కూడా నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి

 నీ సందేశాలు  నాకు అందుతున్నాయి

అవి ఆచరించాలా లేదా అని నా మది ఆలోచిస్తుంది

 నాతో ఎందరూన్న , నువ్వు నా దగ్గరలో ఉన్నావని నా మనసు  చెబుతుంది

నిన్ను వెతకాలని నా మది ఆరాటపడుతుంది ఎవరని వెతుకుతావని నా బుద్ధి ప్రశ్నిస్తుంది

 నన్ను ప్రమాదాల్లోకి నెట్టి వేసేది నువ్వే, తిరిగి

 కాపాడేది నువ్వే.

   నన్ను భయపెట్టేది నువ్వే ,  ధైర్యం చెప్పేది  నువ్వే 

 ఎవరు నువ్వు ???

   దైవమా లేదా దయ్యమా..

 నన్ను రక్షిస్తావా లేదా భక్షిస్తావా..

 నన్ను  హెచ్చరిస్తున్నావా, వేదిస్తున్నావా..

 నువ్వు  ఉన్నావంటే ఎవరు నమ్మరు.

 నువ్వు లేవు అంటే నా మనసు నమ్మదు

 నువ్వు  లేవన్నది నిరుపించిన నిజం

 నువ్వు ఉన్నావనడానికి నేను మాత్రమే సాక్ష్యం..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Horror