ట్రైన్ యాక్సిడెంట్
ట్రైన్ యాక్సిడెంట్
గమ్యం చేరాలనే గమనం
అనుకోని మలుపుతో
అర్ధాంతరంగా అసువులు బాసింది
లోపం ఎవరిదైనా
లోకాన్ని విడిపోయిన బంధాల
లోటును తీర్చేది ఎవరు?
అనర్థం జరిగాక అంచనాలు ఎందుకు
అపాయాలు ఆపలేని పదవులు ఎందుకు
ప్రమాదంలో పోయింది ప్రాణమే కాదు
ప్రాణం వెనుక తిరిగిరాని మమకారం
పూర్తవకుండానే వదిలెల్లిన బాధ్యతలు