STORYMIRROR

Lahari Mahendhar Goud

Tragedy Classics Others

4  

Lahari Mahendhar Goud

Tragedy Classics Others

గెలిచి ఓడిపోయా

గెలిచి ఓడిపోయా

1 min
405

ఎలాంటి ఆధారం లేని నా మనసులోకి

నీ రూపం వచ్చి చేరి దానిని ఓడించింది 

నా ఆధీనంలో ఉన్న ఆలోచనలపై

నీ ఊసుల వల వేసి గెలిచావు


స్పందన మరచిన హృదయానికి

నీ చూపుల బాణాలు వేసి ఓడించావు

అచేతమైన నా ఆశలను తట్టిలేపి

నాపై గెలిచింది నీ ప్రేమ 


ఆ ప్రేమ పూవు వికసించాక

నా అస్థిత్వాన్ని కోల్పోయి ఓడిపోయాను

నీ ఎడబాటుతో మళ్ళీ నన్ను ప్రాణమున్న మోడులా చేసి

నాపై నువ్వు గెలిచావు


కాలంతో పాటు ప్రతీసారి

గెలుపు - ఓటమిల మధ్య జరిగే యుద్ధంలో

నా ప్రేమ ఓడిపోయి మిగిల్చిన 

కన్నీటి సుడులన్నీ చల్లార్చలేకపోయిన

నీ కోపాగ్ని మళ్ళీ మళ్ళీ నాపై గెలిచింది 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy