ఆత్మహత్యే పరిష్కారమా?
ఆత్మహత్యే పరిష్కారమా?
"జీవితం అంటే పుట్టుక నుంచి చావు వరకూ చేసే ప్రయాణం..
నీలో ఉన్న మరో మనిషిని తెలుసుకోవటానికి
నీతో నువ్వే చేసే ప్రయాణం"...
"నువు వేసే అడుగులలో ముళ్ళు రావటం సహజమే
వాటిని దాటుకొని వెళ్లకు, ముళ్ళను తొలగిస్తూ వెళ్తే
నీ వెనుక నడిచే వాళ్ళకి, ముందుకెళ్ళే బాటవుతుంది"...
"నువు చేరే ప్రతీ మలుపులో ఎత్తుపల్లాలు రావొచ్చు
వాటిని అధిగమిస్తూ వెళ్ళకు, చదును చేస్తూ వెళ్తే
మార్గ నిర్దేశకులు అవుతారు"...
"నువు చేరుకునే మజిలీలో ఎదురయ్యే
ప్రతీ అవాంతరాన్ని అనుభవాలుగా చేసుకుని ముందుకు సాగిపోతేనే
నీ ప్రయాణం ఇంకొందరికి దిశను మార్చే నిఘంటువు అవుతుంది"...
"నువు తీసుకునే నిర్ణయంలో,ఎన్నో కలలు కల్లోలం అవొచ్చు
ప్రాణం పోసే వాళ్ళే, ప్రాణాలు తీస్తే
కిరాతకులకి మంచీ చెడూ ఎలా తెలుస్తుంది".
