ప్రేమ పిపాసి (పిశాచి)
ప్రేమ పిపాసి (పిశాచి)
కర్కషమైన మాటల వెనుక
కడలల్లే పొంగే ప్రేమని దాచేస్తూ
కళ్లలో బాధని కనపడనీయకుండా
కనుమరుగై పోతున్నాను నీ నుండి
మన్నించు ప్రాణమా
మరు జన్మ వరకూ...
దయచూపకు నాపై
నీ దరి చేరనీకుండా...
నీ ప్రతీ ఆనందంలో
నీ పెదవుల మీద నవ్వుని నేనై విరబూస్తు
ఎప్పటికీ నీ చుట్టూనే ఉంటాను ప్రియతమా
నా వల్ల నీకు సంతోషాలు ఉండాలి కానీ
సంకోచాల అవమానాలు ఎదురవ్వకూడదని
నా మనసుని కాపలా పెట్టి వెళ్తున్నాను
కరిగిపోయే కాలంతో పాటు
నీ మనసుకి తగిలిన గాయం కూడా
మరిచిపోతావని ఆశిస్తూ
నీ
ప్రేమ పిపాసి (పిశాచి)నీ