STORYMIRROR

Midhun babu

Horror Classics Fantasy

4  

Midhun babu

Horror Classics Fantasy

కొర్కెల భూతం

కొర్కెల భూతం

1 min
3


ముసుగేసిన మనసే భూతమంటా,

కోర్కెల రథమెక్కి తిరగడమే 

తన నైజమంటా.


బ్రమలు చూపి జ్ఞానహింస చేయునంటా,

కనిపించక నాట్యమాడుతూ కలవరాలను దరిచేర్చునంటా,

నిట్టూర్పుల జ్వాలలతో నరకమే చూపునంటా,

ఊహలింటి మేడలు చూపి 

నిదురనే నిదురబుచ్చునంటా,

మోహలు భయాందోళనలే 

భూత ప్రేత పిశాచాలంటా.


కవ్వించే మనసును 

ధ్యానంతో జయించవచ్చునంటా,

మనసుగొడవ అర్ధం చేసుకున్న జ్ఞానమదే 

దేవతలేవరో దయ్యాలెవరో తెలుసుకొనునంటా,

బహునటనల లోకంలో 

నిన్ను నీవు తెలుసుకుంటే 

మాయ ముసుగే కనపడదంటా 

నీ హృదే నీకు గురువైతే 

సత్యమెరుక కలుగునంటా,

గందరగోళపు 

కోర్కెల వలయంనుండి 

బ్రతుకు బయటపడితే 

సత్య సంతోషాలతో జీవితమే సాగునంటా


Rate this content
Log in

Similar telugu poem from Horror