భయం- మనిషి బలహీనత
భయం- మనిషి బలహీనత
మంచి చెడుల సమ్మేళనం,
భూతప్రేతముల స్వరూపం,
ఊహలకు నిజాలకు పోరాటం,
అర్థం కాని అయోమయం.
నమ్మకాల వలలో చిక్కుకున్న ప్రాణం,
బయటపడేందుకు చూపదుయే మార్గం,
ప్రతి దారిలో అపాయం,
భయాందోళనలకు నివాసం.
దైవం పై నమ్మకం,
చెడు శక్తుల నిర్ధారణకు అయ్యేను సాక్ష్యం.
అడుగడుగునా కొత్త ప్రశ్నల వర్షం,
సమాధానాల వేటలో మనసు లగ్నం,
ఎందుకో తెలియని భయం
అంతుచిక్కని ఆందోళనలో హృదయం.

