అది కలయేన
అది కలయేన


ప౹౹
అది కలయేన నిజముగానే కలయేనా అది
ఏది కలో భ్రమో తెలుసుకొనలేన దాని ఆది |2|
చ||
నిదురలో నిజముగానే కల ఒకటి వచ్చింది
ఎదురుగా నిలిచి నువ్వేనా నను మెచ్చింది
|2|
ఆ కలవరమే కలలోను కలతనే పెంచేసింది
ఏ వరము కోరక మదినే స్తబ్దుగ ఉంచేసింది
|ప|
చ||
కనుగొన్నానే నీలో ఏదో సరి కొత్తగ తళుకూ
అనుకున్నానే విని తీయని మెత్తని పలుకూ
|2|
ఎక్కడలేని ఆనందమూ మెరిసే ఆ కళ్ళలో
ఎన్నడులేని ప్రేమే కురిసే తను వొత్తిళ్ళలో
|ప|
చ||
ఊహలలో ఊరించి ఊసులతోనే లయించి
ఊయలలా ఊపేసి మనసునే ఇక జయించి |2|
ఆ స్వర్గమే దిగివచ్చునని ఎడదే పరవశించి
ఆస్వప్నమే మరి నిజమవుతుందని ఆశించి
|ప|
వాస్తవానికి కలలకొచ్చింది ఓ ఆత్మ..........
ఆ కలనే తలచినా మనసంతా భయానకం
ఆ కలత తోనే తనువంతా ఒకటే పూనకం