Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MULA VEERESWARA RAO

Horror Tragedy Classics

3.7  

MULA VEERESWARA RAO

Horror Tragedy Classics

తల వంచ లేదు కరోనా

తల వంచ లేదు కరోనా

1 min
23.6K


తలవంచ లేదు కరోనా !

కనబడే జాబిల్లిని తాకాడు

మానవుడు

జాలి లేని సూక్ష్మ జీవి కి తల

వంచాడా ?

విశ్వ రహస్యాలను వెలికి తీసాడు

కరోనాను ఒక కొలిక్కి తేలేడా ?

వలస లై ఆకలి ప్రవాహాలై సాగే

అమాయకుల్ని ఆదు కోలేడా ?

విశ్వ విపణి లో విలువల్ని 

మరిచిన కొన్ని దేశాలువిశ్వాన్ని

కరోనా గ్రామం గా మారిస్తే

కరోనా పై సంగ్రామం సాగదా ?

మహమ్మారులను ఎన్నో

మట్టు పెట్టాడు మానవుడు

అకుంఠిత దీక్షతో సాగాడు

సాహసి

కరోనా నిన్ను తరుముతాడు

రోదసి దాకా !

విశ్వ మానవ కళ్యాణమే

శ్రేయస్సు గా తలిచాడు

కరోనా నిర్మూలన తపస్సు గా

మలిచాడు !

మాంత్రికుడి ప్రాణం చిలక లో

ఉన్నట్టు

నీ గుట్టు రట్టయ్యే రోజు వస్తుంది !

వాక్సినై అందరికీ అందుతుంది !

ఇప్పుడు గ్రుహం లో ఉండచ్చు

రేపు నీ ఉనికిని ఈ గ్రహం లో

లేకుండా చేస్తారు !

ఇంట్లో ఉన్నా మూలాల్ని

పట్టుకున్నాం !

విలువల మూల్యాంకనం

చేసుకున్నాం !

కుటుంబ బంధాల సుగంధాలను

ఆఘ్రాణిస్తున్నాం !

మాకు మేమే జనసంద్రం లో 

ఏకాంత ద్వీపాలయినాము 

ప్రభుత్వ ఆకాంక్ష ల మేరకే 

నడకను ఇంటికే పరిమితం చేసుకున్నాం 

నడతను మార్చుకున్నాం

అహరహం మా ధన్వంతురులు 

కరోనా పోరు లో 

ఖడ్గ చాలనం చేస్తున్నారు !

తలవంచ లేదు కరోనా !

ఇస్తాం వాక్సిన్ నజరానా


Rate this content
Log in

Similar telugu poem from Horror