భీకరమైన కల
భీకరమైన కల


ప్రతి కల కేవలం మనసులో దాగివున్న ఆలోచన,
నిజమైతే ప్రతి వ్యక్తికీ అయ్యెను ఒక రమ్యమైన రచన |౧|
మనలో భయాందోళనలు ఉంటే వచ్చెను ఒక భయంకర స్వప్నం,
ఏదైనా అనుచిత అల్లకల్లోల ఘటన చూస్తే అయ్యెను నిద్రాభంగం |౨|
ఒక భయంకరమైన లోకానికి తీసుకెళ్ళేను భీకరమైన కల,
మన ధైర్యాన్ని పగలకొట్టడానికి ఇది ఒక వశీకరించే వల |3|
ఇలాంటి కలలలో కనిపించెను రకరకాల బెదిరించే పరలోక ప్రాణులు,
ఇహలోకంలో కనిపించవు ఈ ఊహాత్మక విచిత్రమైన జంతువులూ |౪|
ఎంతో అవసరమైనది మంచి అభిప్రాయంతో నిద్రించటం,
దేవుని చింతతో పడుకుంటే రాదు చెడు స్వప్నాలతో ఆరాటం |౫|
భీకరమైన కల ఊరకే వచ్చే అనుకోని ఘటన,
ఎన్నటికీ ఇది అవదు జీవితంలో ఓ విషాద సంఘటన |౬|