నేనొక జీవచ్ఛవం!
నేనొక జీవచ్ఛవం!
నా నమ్మకాన్ని నవ్వుల పాలు చేశావు
నా విశ్వసాన్ని వీధిలోకి ఇడ్చావు
నా నిజాయితీకి నిలువుగా నిప్పంటించావు
నా విలువల్ని చెత్త కుప్పలో పొశావు
నా చైతన్యాన్ని అచేతనం చేసావు
నా ప్రేమను పెంట దిబ్బల్లో పారవేశావు
నా విజయాలను ఉరికంభం ఎక్కించావు
నా అస్థిత్వాన్ని అంతం గావించావు
నన్ను ఒక చెల్లని నాణెంగా చేసావు
నా బోలతనం బోంద పెట్టావు
నా చిరునవ్వులని చిందరవందరగా చేసావు
నా సంతోషాన్ని స్మశానానికి సాగనంపావు
నా గుండెను పెద్ద బండతో బాధవు
ఇప్పుడు నా మది సమాదిలో ఉన్నట్టుంది
నా శరీరం చలనత్వం లేని నిశ్చలత్వం సంతరించుకుంది
నా కళ్ళు శవాల ఉరేగింపులను,
స్మశానంలో పూల పందిరిని చూస్తున్నాయి
నా చెవులు శోక రాగాలను,
మృత్య్వు గోషను వింటున్నాయి
నా నాలుక తడి అరీపోయి,
జీవరుచులను కోల్పోయింది
నా ముక్కు కాలిన కాయం యొక్క
కమురు వాసనను పిలుస్తున్నాయి
నా కాళ్ళు మృత్యు తీరం వైపు సాగుతున్నాయి
నా చేతులు సెలవు కోరుతూ సెల్యూటు చేస్తున్నాయి
నిజం! ఇపుడు నేనొక జీవచ్ఛవం..........

