STORYMIRROR

Midhun babu

Horror

4  

Midhun babu

Horror

భయం నీడలో...

భయం నీడలో...

1 min
265


కనురెప్పల నీడ

కల కలమో కలవరమో పీడ! 

కప్పల బెక బెకలు

ఎండిన గుంటలలో !

పట్టుమని ఒక్క చెట్టైనా లేని

అరణ్యాలలో

అంగాలకు ఆకులైనా చుట్టని

ఆదిమానవులు !

నగర వీధులలోనే

నక్కల వూళలు 

సంధ్య వేళనే 

మిణుగురుల మెరుపులు

ఖణేల్ మని తీతువుల కేకలు

కీచురాళ్ళ ఖొరస్సులు

నా పల్లెలో పగలే వీధుల్లో

పులులూ తోడేళ్లు

మిడిమిడి ఎండలో

స్పృహలో లేని పదునాలుగేళ్ళ బాలికపై

సామూహిక అత్యాచారం

నిమిషాలు కాదు

గంటలూకాదు

రోజంతా!

నాగుడి మసీదుకు మంట పెట్టింది

మసీదు కాలిపోతూ చర్చిపై వాలింది

అన్నీ కాలిపోతుంటే ఆఛేతణుడనైనా నేను

నండూరి ఎంకి

నాయుడు బావను పొడిచి పొడిచి

చచ్చాడని నిర్ధారించి

కామారెడ్డితో లేచిపోయింది !

పసుపు జండాలూ తెల్లజెండాల కొట్లాటలో

పగిలాయేమో తలలు

నేల తడిసిన రుధిరం 

ఇంకనూ లేదు అంబుధిలో కలవనూ లేదు

నగ్న దేహంతో మంచుకొండలో నేను

గజగజ వణుకుతూ !

పబ్బులో డ్రగ్గులు మ్రింగి

గర్భం తెచ్చుకున్న యువతి

సవాలు విసురుతూందీ సమాజంపై

తొడలు చరుస్తూ !,


పిచ్చి కూతలు ఎర్రసిరాతో వ్రాస్తున్నానని

రెచ్చ కొడుతున్నాను యువతనని 

కచ్చడాలు తొడిగి

కారాగార బంధనం చేశారు 

లాఠీలు నా మోకాళ్లపై దాడిని భరించలేక

బాధతో వెర్రి కేక వేశాను 

కళ్ళు తెరిచి చూశాను 

కళత్రం కౌగిలో నేను !

పెరిగిన గుండె స్పందనతో...


  ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Horror