బీరువా భూతం
బీరువా భూతం


నాకు బీరువాలంటే భయం
బీరువాలోని డబ్బులంటే కాదు
ఏదో పీడకల
మళ్లీ అదే కల
రోజూ వచ్చేదే
అచ్చం అన్వేషితలోలా
బీరువా పైన ఏదో చప్పుడు
ఎవరో మాట్లాడుతున్నారు
క బీ స్
కబీసే
కాదు కాదు
అలానే ఉన్నాడు
అవునూ కబీస్ కి కొమ్ములు లేవు కదా
నిద్ర వేళకి ఎందుకీ గోల
కబీస్ ఉంటే మస్తానమ్మ కూడా ఉంటుంది
కీరా బీస్ కీరా పానీ
అలా ఏదో అంటూ
మంచం మీద నుండి దబ్బున కింద పడ్డాను
భూతాల సంగతేమో కానీ
నడుం నొప్పికి మందు వ్రాసుకోవాలి.