STORYMIRROR

Dinakar Reddy

Abstract Horror Thriller

4  

Dinakar Reddy

Abstract Horror Thriller

భయానకం

భయానకం

1 min
375

బదులు లేని ప్రశ్నలా

వర్షపు చప్పుడు

నిద్రలో వినిపించే అడుగుల చప్పుడు

లేని పాత్రలు ఉన్నట్టు అనిపించే సినిమా చూసేటప్పుడు


రక్తం కన్నా నవ్వు ఒక్కోసారి 

దాడి కన్నా మౌనం ఒక్కోసారి

ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి


అలాంటి భయానక విషయాలు

రోజూ నీ చుట్టూ జరుగుతుంటే 

ఇక కొత్తగా భయపడి బాధపడే అవసరం రాదేమో


చీకటి భయాలు ఎన్నో

బయట ఉన్న చీకటి ఎంతో 

దాన్ని తరిమేందుకు మార్గాలు ఎన్నో

మరి లోపల ఉన్న చీకటికి సమాధానం

జ్ఞానమనే వెలుగే కదా


మరి అది తెలుసుకోవడానికి

భయమెందుకు

నీ ఆత్మ నీతో చెప్పే విషయాలు వినేందుకు

అంత గుబులెందుకు



Rate this content
Log in

Similar telugu poem from Abstract